హైదరాబాద్: LB నగర్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. ఎల్బీనగర్ చౌరస్తాలో ఫ్లైఓవర్ ప్రారంభమైంది. ఫ్లైఓవర్ ను ఇవాళ మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డిలు ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఎల్బీనగర్ జంక్షన్ వద్ద నిర్మించింది. దేశంలో ఎక్కడాలేని విధంగా తొలిసారి హైదరాబాద్ లో చేపడుతున్న పలు నిర్మాణాలకు ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు.
ఫ్లైఓవర్ ప్రారంభంతో హైదరాబాద్ వైపు నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు ఎల్బీనగర్ జంక్షన్‌లో ఆపాల్సిన అవసరం ఉండదు. ఈ మార్గం సిగ్నల్ ఫ్రీగా మారిపోతుంది. ఎస్‌ఆర్డీపీ పథకం కింద టీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.23 వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టును చేపట్టింది. మొదటిదశంలో ఎల్బీనగర్ జంక్షన్‌తోపాటు పరిసర ప్రాంతాల్లోని నాలుగు జంక్షన్లలో రూ.448 కోట్లతో మల్టీలెవల్/ గ్రేడ్ సెపరేటర్లను నిర్మించింది.
