చాక్లెట్లు ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు

చాక్లెట్లు ఇచ్చి థ్యాంక్స్ చెప్పిన ట్రాఫిక్ పోలీసులు

నిబంధనలు ఉల్లంఘించే వాహణదారులపై ఎప్పుడూ చలాన్లు విధించే ట్రాఫిక్ పోలీసులు ఇప్పుడు నిబంధనలు పాటించే వారిపై దృష్టి పెట్టారు. వారిని పట్టుకొని నోరు తీపి చేసి థ్యాంక్స్ చెబుతున్నారు. తలకు హెల్మెట్, బండికి నెంబర్ ప్లేట్, కార్లో వెళ్తున్నవారు సీటు బెల్టు.. ఇలా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్న వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు చాక్లెట్ ఇచ్చి థ్యాంక్స్ చెప్పారు. హెల్మెట్ పెట్టుకోవడమే కాదు దానికి బెల్టు కూడా పెట్టుకోవాలని సూచించారు. 

ఎల్బీనగర్ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వెహికల్స్ నడుపుతున్న వారికి ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పిస్తూ ఇలా చాక్లెట్లు అందించారు. ట్రాఫిక్ రూల్స్ ఉన్నవి మన క్షేమం కోసమేనని వాటిని పాటిస్తూ మనతోపాటు తోటి వారికి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత ప్రతి పౌరుడుపై ఉందని ఎల్బీనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. రోడ్డు సేఫ్టీ వీక్ లో భాగంగా పబ్లిక్ లో అవగాహన కల్పించడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ట్రాఫిక్ పోలీసులు పాటలు సైతం పాడుతూ అవేర్నెస్ కల్పించారు.