రేపు (అక్టోబర్ 2న) ఎల్బీ స్టేడియంలో చరకాల ప్రదర్శన

రేపు (అక్టోబర్ 2న) ఎల్బీ స్టేడియంలో చరకాల ప్రదర్శన
  • 1,157 చరకాలతో గాంధీ జ్ఞాన ప్రతిష్ట సంస్థ ప్రత్యేక కార్యక్రమాలు

హైదరాబాద్, వెలుగు: అక్టోబర్ 2న మహాత్మాగాంధీ 157వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియంలో 1157 చరకాలను ప్రదర్శించనున్నట్లు గాంధీ జ్ఞాన ప్రతిష్ట సంస్థ ప్రకటించింది. పీసీసీ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరవుతారని సంస్థ ప్రతినిధులు అల్లం భాస్కర్, శ్రీనివాస్ రెడ్డి, కల్వ సుజాత తదితరులు తెలిపారు. గాంధీ ఆలోచనలను నేటి తరానికి  పరిచయం చేయడం ఈ సంస్థ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. గాంధీ ఆలోచనలను ప్రదర్శనల ద్వారా నిర్వహించడంతో ప్రజల్లో ఆయన సిద్ధాంతాలు తొందరగా వ్యాప్తి చెందుతాయని వివరించారు.