బీఆర్ఎస్ వేల కోట్ల భూదోపిడీపై ఫోకస్ పెట్టాలి
నా నియోజకవర్గంలోని 79 ఎకరాల ఇనాం భూమిని బీఆర్ఎస్ హయాంలో ఓఆర్సీ ద్వారా పట్టా చేయించుకున్నారు. నేను గెలిచిన తర్వాత దీనిపై మళ్లీ విచారణ చేయించి ఆ భూమిని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకునేలా చేశాం. ధర్మపురి నియోజకవర్గంలోని వెయ్యి ఎకరాల భూమి పేదలకు అందేలా చర్యలు తీసుకోవాలి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయల విలువైన భూములను దోచుకున్నారు. ఆ భూదోపిడీపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి విచారణ జరపాలి. ప్రభుత్వ భూములను కాపాడడంతో పాటు అర్హులైన పేదలకు న్యాయం చేయాలి.
- అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మంత్రి
ప్రజలను బీఆర్ఎస్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసింది
భూమిపై ప్రజలకు ఉండే భావోద్వేగాన్ని అడ్డుపెట్టుకుని గత ప్రభుత్వం ప్రజల ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసింది. ధరణిని ఎవరూ కోరుకోలేదు. కానీ, దానిని తీసుకొచ్చి భూదోపిడీకి తెరదీశారు. రాష్ట్ర ప్రజలను గందరగోళానికి గురిచేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 22–ఏపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ రాబం దుల మాటలను ప్రజలు నమ్మొద్దు. త్రేతాయుగంలో భూములు మింగిన బకాసురుల గురించి విన్నాం.. బీఆర్ఎస్ హయాంలో 51 చెరువులను బాగుచేసే పేరుతో సీఎస్ఆర్ కింద కంపెనీలకు కట్టబెట్టారు. దీనిపై ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.
- వేముల వీరేశం, ఎమ్మెల్యే
భూముల్నే కాదు.. పందులనూ వదల్లేదు
శంకర్‌హిల్స్‌లో నా తల్లి కూడా బాధితురాలే. ధరణి వల్ల ఆమెకు చెందిన 325 గజాల స్థలం పోయింది. జడ్చర్ల లోని సరస్వతీ నగర్ లో 200 ఎకరాల భూమి 2022లో నిషేధిత జాబితాలో ఉండటంతో గత ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయలేదు. బీఆర్ఎస్ హయాంలో భూములనే కాదు.. పందులనూ వద ల్లేదు. ఇప్పుడు మా దగ్గర కోతులు, కుక్కలే ఉన్నా యి.. వాటిని కూడా ఎత్తుకెళ్తారేమో! నా నియోజకవర్గంలో ఇసుకను కూడా మిగల్చలేదు. 22–ఏ చాలా అవసరం. ప్రభుత్వ భూములను కాపాడుకోకపోతే ఎలా? జడ్చర్లలో శ్మశానవాటికకు కూడా స్థలం లేదు.
- అనిరుధ్ రెడ్డి, ఎమ్మెల్యే
అసలు వీరప్పన్ బీఆర్ఎస్ పార్టీనే
22–ఏ కింద నిషేధి త జాబితా ఇప్పటిది కాదు. 1999లోనే దీనిని తీసుకొచ్చారు. ఆ తర్వాత 2007లో చట్టం తెచ్చారు. పాత ఆర్వోఆర్ విధానంలో అన్నీ బాగానే ఉండేవి. కానీ, బీఆర్ఎస్ నేతలు ధరణిని తీసుకొచ్చి వ్యవస్థను సర్వనాశనం చేశారు. ప్రభుత్వ భూములను తమ అనుచరులకు పట్టాలు చేశారు. అసలు వీరప్పన్ బీఆర్ఎస్ పార్టీనే. ధరణిని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా దోచుకున్నవాళ్లే అసలైన వీరప్పన్లు. వాళ్లు చేసిన తప్పులను సరిదిద్దుతూ పారదర్శక పాలన అందిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ నేతలు విమర్శించడం దారుణం. గత పదేళ్లలో అన్ని వ్యవస్థలనూ నాశనం చేశారు.
- గవినోళ్ల మధుసూదన్ రెడ్డి, ఎమ్మెల్యే
బీఆర్ఎస్ దొంగలపై పీడీ యాక్ట్ పెట్టాలి
బీఆర్ఎస్ దొంగలపై పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపాలి. వాళ్లు దోచుకు న్న భూములను తిరిగి స్వాధీనం చేసుకోవాలి. చిన్న పిల్లలున్న కలెక్టర్లను కూడా అర్ధరాత్రి పిలిపించుకుని భూము లను పట్టాలుగా మార్చుకున్నారు. ఇప్పుడు మాక్ అసెంబ్లీ పెట్టి వెకిలి చేష్టలు చేస్తున్నారు. 20 ఏండ్లుగా పేదలు సాగు చేసుకుంటున్న భూములు, నివాసం ఉంటున్న ఇండ్లను రెగ్యులరైజ్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలి. పేదలకు న్యాయం చేస్తూనే ప్రభుత్వ భూములను కాపాడాలి.
- నాయిని రాజేందర్ రెడ్డి, ఎమ్మెల్యే
