ఎన్నికలతో విలువైన పాఠాలు నేర్చుకున్నం : మల్లికార్జున్​ఖర్గే

ఎన్నికలతో విలువైన పాఠాలు నేర్చుకున్నం : మల్లికార్జున్​ఖర్గే

న్యూఢిల్లీ: ఇటీవల వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నుంచి తమ పార్టీ విలువైన పాఠాలు నేర్చు కుందని కాంగ్రెస్​చీఫ్​మల్లికార్జున్​ఖర్గే అన్నారు. అయితే, తాము చేసి న తప్పుల తెలుసుకున్నామని, అవి పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గురువారం ఢిల్లీలో ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ చైర్‌ పర్స న్ సోనియా గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇండి యా కూటమి భాగస్వాములతో సీట్ల పంపకం, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ వ్యూహం, మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను ఈ సమావేశంలో చర్చించారు.

 ఖర్గే మాట్లాడుతూ.. ఫలితాలు నిరాశాజనకంగా ఉన్నప్పటికీ, ఆ రాష్ట్రాల్లో ఓట్ల శాతం మెరుగ్గా ఉందని తెలిపారు. కొంత శ్రద్ధపెట్టి పనిచేస్తే కచ్చితంగా అనుకూల ఫలితాలు సాధిస్తామని చెప్పారు. పార్టీ కార్యకర్తలు 2024 లోక్‌సభ ఎన్నికలపై దృష్టి పెట్టాలని ఆయన కోరారు. లోక్‌సభ స్పీకర్‌, రాజ్యసభ చైర్మన్‌పై ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేయడంపై స్పందిస్తూ.. ఎంపీలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కలిగిన వారే తమ రాజ్యాంగ విధుల్లో విఫలమయ్యారని ఖర్గే విమర్శించారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ఘోరంగా ఓడిపోయిన తర్వాత ఆ పార్టీ అగ్రనేతలు సమావేశం కావడం ఇదే తొలిసారి.