పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో లెక్చరర్‌‌ ఉద్యోగాలు

పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో లెక్చరర్‌‌ ఉద్యోగాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన టెక్నికల్ ఎడ్యుకేషన్ సర్వీసులోని ప్రభుత్వ పాలిటెక్నిక్‌‌ కాలేజీల్లో 247 పాలిటెక్నిక్‌‌ లెక్చరర్‌‌ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి టీఎస్​పీఎస్సీ అప్లికేషన్స్​ కోరుతోంది.
అర్హత:  ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత స్పెషలైజేషన్‌‌లో ఇంజినీరింగ్‌‌ కోర్సులో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. వయసు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తులు: అభ్యర్థులు ఆన్​లైన్​లో డిసెంబర్‌‌ 14వ తేదీ నుంచి జనవరి 4 వరకు అప్లై చేసుకోవచ్చు. మే/జూన్‌‌ నెలల్లో రాత పరీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఎంపికైన వారికి నెలకు రూ..56,100ల నుంచి రూ.1,82,400ల వరకు జీతంగా చెల్లిస్తారు. పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.