‘యూఏఈ’కు లీ ఫార్మా స్మూత్‌‌‌‌‌‌‌‌వాక్ టాబ్లెట్స్

‘యూఏఈ’కు లీ ఫార్మా స్మూత్‌‌‌‌‌‌‌‌వాక్ టాబ్లెట్స్

హైదరాబాద్, వెలుగు :  ఫార్మాస్యూటికల్ కంపెనీ లీ ఫార్మా.. కీళ్ల వ్యాధి చికిత్సలో వాడే  బయో-కార్టిలేజ్ స్మూత్‌‌‌‌‌‌‌‌వాక్ టాబ్లెట్లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రాంతంలో మార్కెట్ చేయనుంది. యూఏఈకి చెందిన మినిస్ట్రీ ఆఫ్ హెల్త్  నుంచి ఈ మేరకు అనుమతి పొందింది.  భారత్ లో తయారైన ఇటువంటి ఉత్పాదనకు యూఏఈలో ఆమోదం రావడం ఇదే మొదటిసారి అని ప్రకటించింది. ఈ ఉత్పత్తిని ఆన్ని మధ్యప్రాచ్య దేశాలలో, తూర్పు ఆసియా దేశాలలో విక్రయించేందుకు కంపెనీ దరఖాస్తు చేసుకుంది. అలాగే మార్కెటింగ్ ఆథరైజేషన్ కోసం యూఎస్ ప్రభుత్వానికి 2024 మూడవ క్వార్టర్​లో  దరఖాస్తు చేస్తామని కంపెనీ డైరెక్టర్ లీలా రాణి ఈ సందర్భంగా తెలిపారు.