30న వామపక్షాల సదస్సు

30న వామపక్షాల సదస్సు

హైదరాబాద్, వెలుగు :  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజల సమస్యలు పరిష్కరించడంలో విఫలమైందని 11 వామపక్షాల రాష్ట్ర కమిటీలు విమర్శించాయి. బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 30న వామపక్షాల రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నట్లు వెల్లడించాయి.

ఈ మేరకు నాయకులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాల్లోని గవర్నర్‌‌‌‌ వ్యవస్థను తమ స్వార్థ ప్రయోజనాలకోసం బీజేపీ సర్కారు వాడుకుంటోందని నాయకులు ఆరోపించారు. ఎన్నికలకు ముందు ఈడీ, ఐటీ దాడులతో ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు వెల్లడించారు.