కందులతో కండబలం..!

కందులతో కండబలం..!

మనదేశంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఈ కందులను విరివిగా వినియోగిస్తారు. ఆఫ్రికా, లాటిన్‌‌ అమెరికా, ఆసియన్‌‌ దేశాల్లో కూడా కందిపప్పును ఉపయోగిస్తారు. పొట్టుతో ఉండే కందిగింజలను, పొట్టు తీసేసిన కందిపప్పును రకరకాల వంటకాల్లో వాడతారు. కందిపప్పులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తినని వారిలో కండరాల ఎదుగుదల లోపాలు లేకుండా ఉండాలంటే కందిపప్పు వంటి పప్పుజాతి గింజలు తినాల్సిందే.

పోషకాలు: కందిపప్పులో ప్రొటీన్లు, అమైనో యాసిడ్స్, పిండి పదార్థా లు, కొద్దిగా కొవ్వులతో పాటు విటమిన్‌‌–బి1, బి2, బి3, బి5, బి6, విటమిన్‌‌–సి, విటమిన్‌‌–ఇ, విటమిన్‌‌–కె వంటి విటమిన్లు ఉంటాయి.క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, ఫాస్ఫరస్, పొటాషియం, సోడియం, కాపర్, ఐరన్, జింక్‌ వంటి ఖనిజ లవణాలు ఉంటాయి.

ఆరోగ్య లాభాలు: ప్రొటీన్లు పుష్కలంగా ఉండే కందులు, కందిపప్పు కండరాల పెరుగుదలకు దోహదపడుతుంది. ఇందులోని ఐరన్, విటమిన్‌‌–సి రక్తహీనతను దూరం చేస్తాయి. ఇమ్యూనిటీ శక్తిని పెంచుతుంది. శరీరానికి తగిన శక్తినిస్తుంది. జీర్ణా శయ సమస్యలను నివారిస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.