చిరుతకు గుణపాఠం చెప్పిన ముళ్ల పంది

చిరుతకు గుణపాఠం చెప్పిన ముళ్ల పంది

తనపై దాడి చేయబోయిన ఓ చిరుతపులికి తగిన గుణపాఠం చెప్పింది ఓ ముళ్లపంది. తనతో పెట్టుకుంటే ఎంత పెద్ద జంతువైనా సరే తోక ముడవాల్సిందే అన్నట్టు సరైన శాస్తి చేసింది. ఓ అడవిలోని  దారిగుండా వెళుతున్న ముళ్లపందిని, చిరుత దాడి చేయబోయి చివరకు వెనుదిరిగిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పర్వీన్ కశ్వాన్ అనే ఓ ఫారెస్ట్ ఆఫీసర్ ఈ వీడియోను తన ట్విటర్ లో షేర్‌ చేశాడు.

తన దారిలో వెళుతున్న ముళ్ల పందిని.. ఆ చిరుతపులి అడ్డగించి తిందామనుకుని ప్రయత్నించగా.. .. వెంటనే ప్రాణరక్షణ కోసం ముళ్లపంది తన ముళ్లను రెక్కించింది. చిరుత పంటి గాటు తనపై శరీరం పై పడకుండా కాపాడుకుంది. అయినా ఆ  చిరుత ముళ్లపందిపై దాడి చేయబోగా.. దాని ముళ్లు గుచ్చుకోవడంతో నొప్పితో విలవిలలాడింది.తన ముఖం పై  గుచ్చుకున్న ఆ ముల్లును తొలగించుకోవటానికి నానా తంటాలు పడింది. చివరకు ఎలాగోలా తన ముందు కాలుతో ఆ ముల్లును తీసేసి.. ఇక చేసేదేమీ లేదని వెనుదిరిగి వెళ్లిపోయింది.

కశ్వాన్ పోస్ట్ చేసిన ఈ 58 సెకన్ల వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. చిరుతకు ఆ ముళ్లపంది తగిన గుణపాఠం చెప్పిందంటూ కామెంట్లు పెడుతున్నారు.