రాష్ట్రపతి భవన్‌లో చిరుతపులి!.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

 రాష్ట్రపతి భవన్‌లో చిరుతపులి!.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

రాష్ట్రపతిభవన్ లో జూన్ 09వ తేదీ సాయంత్రం 7 గంటలకు  అతిరధ మహారధుల మధ్య మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేశారు.  ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విదేశీ నాయకులు, ఇతర ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, సినీ తారలతో సహా దాదాపు 8,000 మంది అతిథులు హాజరయ్యారు.ఈ వేడుకకు సంబంధించిన చిన్న వీడియో క్లిప్ వైరల్‌గా మారింది. 

అదేంటంటే వీవీఐపీ రూమ్ లో  చిరుత లాంటి ఓ జంతువు స్వేచ్ఛగా తిరుగుతుండటం వీడియోలో రికార్డు అయింది.  ఇది చిరుతపులినా? మామూలు పిల్లినా? లేక కుక్కనా? అనేది తెలియాల్సి ఉంది.  ప్రస్తుతం ఈ వీడియో విస్తృతంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వీడియో వైరల్‌గా మారడంతో సోషల్‌మీడియాలో చర్చ మొదలైంది. చూస్తుంటే ఇది చిరుతపులి లాగే కనిపిస్తుంది అంటూ నెటిజన్లు  కామెంట్స్ చేస్తున్నారు.  

అటు ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ.. తొలి సంతకం చేశారు. దేశ వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి 20 వేల కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. పీఎం కిసాన్ యోజన కింద 17వ విడత నిధులను విడుదల చేస్తూ సంతకం చేశారు మోదీ. దేశవ్యాప్తంగా 9 కోట్ల 30 వేల మంది రైతుల ఖాతాల్లో.. ఒక్కక్కొరికి 2 వేల రూపాయల చొప్పున వారి వారి బ్యాంకుల్లో పడనున్నాయి డబ్బులు.  ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కృషి కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు మోదీ.