
మెదక్/చిన్నశంకరంపేట, వెలుగు: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్గ్రామ పటేల్ చెరువులో చిరుతపులి కళేబరాన్ని గ్రామస్థులు గుర్తించారు. మంగళవారం ఉదయం చెరువు కట్ట మీదుగా పొలాలకు వెళ్తున్న రైతులకు చెరువులో చిరుత కళేబరం కనిపించింది. వెంటనే ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించారు. డీఎఫ్ఓ జ్ఞానేశ్వర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. వెటర్నరీ డాక్టర్తో పోస్టుమార్టం చేయించి శాంపిల్స్సంగారెడ్డికి పంపించారు. ల్యాబ్రిపోర్టును బట్టి చిరుత ఎలా చనిపోయిందో తెలుస్తుందని డీఎఫ్ఓ చెప్పారు.