
అడవిని వదిలి చిరుత పులులు గ్రామాల్లోకి చొరబడి జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓచిరుత.. ఏకంగా పోలీస్ స్టేషన్ కే వెళ్లింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహారాష్ట్రలోని రత్నగిరి పరిధిలోని రాజాపూర్ పోలీస్ స్టేషన్ లోకి జనవరి 24వ తేదీ ఓ చిరుత ఎంటరైంది. దాన్ని గమనించిన పోలీసు సిబ్బంది సేఫ్ ప్లేస్ కు పరుగులు పెట్టారు.
పోలీస్ స్టేషన్ లో ఉన్న కుక్కలు కూడా చిరుతను చూసి ఓ గదిలోకి పరుగెత్తాయి. వెంటనే చిరుత వాటిని వేటాడుతూ.. గదిలోకి ప్రవేశించి ఓ కుక్కను లాక్కెళ్లింది. ఈ సంఘటనకు సంబంధించిన విజువల్స్ స్టేషన్ లో ఉన్న సీసీఫుటేజీలో రికార్డయ్యాయి. పోలీస్ స్టేషన్ లో చిరుత ఎవరిపై దాడి చేయడకపోవడంతో అంత ఊపిరిపీల్చుకున్నారు. చిరుత.. కుక్కను లాక్కెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Video: पोलिस ठाण्यात रात्रीच्या वेळी घुसला बिबट्या अन् पकडली मान...
— policekaka News (@policekaka) January 25, 2024
रत्नागिरी जिल्ह्यातील राजापूर तहसील कार्यालय आणि पोलीस ठाण्याच्या व्हरांड्यातुन कुत्र्याच्या मानेला पकडून नेले आहे.https://t.co/42LUDp6Iqz#leopard #Police #PoliceKaka @RatnagiriPolice pic.twitter.com/CP3eXJz3sX