
నాగపూర్: మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలో వనీ బొగ్గు గని క్షేత్రంలో గుగ్గూస్ రైల్వే సైడింగ్ దగ్గర నిలిపి ఉన్న రైలు ఇంజిన్‌పై చిరుత కళేబరాన్ని గుర్తించారు. రైల్వే అధికారి రాజేష్ సింగ్, పోలీసులకు సమాచారం అందిచ్చారు. వారు చిరుత కళేబరాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం కోసం చంద్రపూర్‌కు తరలించారు.
చిరుత కళేబరం లభించిన రైలు ఇంజిన్ చంద్రపూర్ థర్మల్ పవర్ స్టేషన్‌కు బొగ్గును తరలించేందుకు వచ్చిందని రైల్వే అధికారులు చెప్పారు. ఈ బొగ్గు క్షేత్రం తాడోబా అటవీ పరిసరాల్లో ఉన్నందున రైలు వచ్చే క్రమంలో ఇంజిన్‌పై నుంచి చిరుత దూకబోయి హైటెన్షన్ విద్యుత్తు తీగలకు తగిలి ప్రాణం కోల్పోయి ఉంటుందని అటవీ అధికారులు భావిస్తున్నారు.