ఎన్నికల్లో బీఆర్ఎస్​ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్

ఎన్నికల్లో బీఆర్ఎస్​ను చిత్తుగా ఓడిద్దాం : ఉషాకిరణ్

ఖైరతాబాద్, వెలుగు : బీఆర్ఎస్ ​పార్టీ ఆదివాసీలకు, గిరిజనులకు తీవ్ర ద్రోహం చేసిందని నేషనల్​ ట్రైబల్ ఫెడరేషన్​రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఉషాకిరణ్ మండిపడ్డారు. ఆదివాసీలు, గిరిజనుల జీవనాధారమైన జీఓ నం.3ను సుప్రీంకోర్టు కొట్టివేసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించిందన్నారు. తమను పట్టించుకోని బీఆర్ఎస్ ను అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించామని, లోక్​సభ ఎన్నికల్లోనూ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

ట్రైబల్ ​ఫెడరేషన్ ఆధ్వర్యంలో గురువారం సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. గిరిజనులంతా కాంగ్రెస్​అభ్యర్థులకు మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. శుక్రవారం అన్ని జిల్లాల్లో పర్యటిస్తామని, కాంగ్రెస్ ​గెలుపు కోసం కృషి చేస్తామని చెప్పారు.

ప్రత్యేక ఎస్టీ కమిషన్​తోపాటు ట్రైబల్ యూనివర్సిటీ​ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్​ మేడ విజయ్, డాక్టర్​స్టీఫెన్, దేవర విజయ, రామస్వామి, సురేశ్, శేఖర్, గంగాధర్​ పాల్గొన్నారు.