
న్యూఢిల్లీ: దేశంలో బలమైన నాయకుడు లేకుంటే ప్రతి సిటీలో అఫ్తాబ్ పుడతాడని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన శనివారం కచ్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొని, మాట్లాడారు. బలమైన లీడర్ లేకుంటే ప్రతి ఊరిలోనూ అఫ్తాబ్ పుట్టుకొచ్చి సమాజాన్ని నాశనం చేస్తాడని ప్రజలను హిమంత బిస్వా శర్మ హెచ్చరించారు.
2024లో జరగనున్న ఎన్నికల్లో మోడీని మూడోసారి గెలిపించి ప్రధానిని చేయాలని కోరారు. ప్రచారంలో శ్రద్ధ వాకర్ హత్య గురించి వివరించిన సీఎం.. అది లవ్ జిహాద్ అని పేర్కొన్నారు. ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ముస్లిం యువకులు ఇస్లాంలోకి మారాలని ఫోర్స్ చేస్తున్నారని తెలిపారు