ఏఐ టెక్నాలజీతో పనిచేసే కొత్త క్యూఎల్‌ఈడీ టీవీలను ఎల్‌జీ లాంచ్ చేసింది. ఎల్‌జీ క్యూఎల్‌ఈడీ ఎవో ఏఐ, ఎల్‌జీ క్యూఎన్‌ఈడీ ఏఐ, ఎల్‌జీ క్యూఎల్‌ఈడీ 97జీ4 మోడల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. వీటి సైజ్ 43 ఇంచుల నుంచి 97 ఇంచుల మధ్య ఉంది.
ఎల్‌జీ ఓఎల్‌ఈడీ ఎవో జీ4 సిరీస్‌లో లేటెస్ట్ వేరియంట్ల ధర రూ.2.39 లక్షల నుంచి మొదలవుతోంది. ఎవో సీ4 ఏఐ సిరీస్ టీవీల ధర రూ. 1.19 లక్షల నుంచి, బీ4 ఏఐ సిరీస్ ధర రూ.1.69 లక్షల నుంచి ఉంది. క్యూఎన్‌ఈడీ సిరీస్ టీవీల ధర రూ.63 వేల నుంచి మొదలవుతోంది.
