ఎస్‌బీఐలో పెరిగిన ఎల్‌ఐసీ వాటా

ఎస్‌బీఐలో పెరిగిన ఎల్‌ఐసీ వాటా

న్యూఢిల్లీ: దేశంలోని అతి పెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్​ఐసీ),  స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్​బీఐ)లో తన వాటాను పెంచుకుంది.  ల్ఐసీ ఓపెన్ మార్కెట్ కొనుగోలు ద్వారా ఎస్‌బీఐలో సోమవారం 0.28 శాతం అదనపు వాటాను కొనుగోలు చేసింది. దీనితో ఎల్‌ఐసీ వాటా 9.49 శాతానికి చేరుకుంది. ఈ కొనుగోలుతో ఎల్ఐసీ ఎస్‌బీఐలో కీలకమైన వాటాదారుగా మారింది. ఈ అదనపు షేర్ల కొనుగోలు విలువ దాదాపు రూ. 5,000 కోట్లు ఉంటుందని అంచనా. ఈ లావాదేవీల గురించి ఎల్‌ఐసీ అధికారికంగా స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది.