భోలే బాబాకు నేర చరిత్ర

భోలే బాబాకు నేర చరిత్ర
  • లైంగిక వేధింపుల కేసులో జైలుక
  • బాబాపై భూ కబ్జా ఆరోపణలు
  • చనిపోయిన అమ్మాయిని బతికిస్తానంటూ ప్రచారం
  • 23 ఏండ్ల కింద అరెస్ట్ చేసిన ఆగ్రా పోలీసులు

హత్రాస్(యూపీ): హత్రాస్ జిల్లా ఫుల్‌‌‌‌రయీ గ్రామంలో జరిగిన సత్సంగ్‌‌‌‌ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య 121కు చేరింది. ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాతి నుంచి భోలే బాబా అలియాస్ సూరజ్ పాల్ కనిపించకుండా పోయాడు. సత్సంగ్ నిర్వాహకులపై కేసు నమోదుచేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పోలీస్ డిపార్ట్​మెంట్ నుంచి బయటికొచ్చిన తర్వాత భోలే బాబా కొన్ని కేసులు ఎదుర్కొంటున్నాడు.

అతనికి క్రిమినల్ హిస్టరీ ఉందని యూపీ పోలీసులు తెలిపారు. లైంగిక వేధింపుల కేసుల్లో భోలే బాబా నిందితుడని చెప్పారు. ఆగ్రా, ఎటావా, కాస్​గంజ్, ఫర్రూఖాబాద్, రాజస్థాన్​లోనూ ఇతనిపై కేసులు ఉన్నాయి. లైంగిక వేధింపుల కేసులో 1997లో అరెస్టయి కొన్నాళ్ల పాటు జైలులో ఉన్నాడు. బయటకు వచ్చి తన పేరును ‘సాకార్‌‌‌‌ విశ్వ హరి బాబా’గా మార్చుకున్నాడు. తన పూర్వీకుల గ్రామంలో ఆశ్రమం తెరిచి ప్రవచనాలు ఇచ్చేవాడు.. ఆ తర్వాత భోలే బాబాగా మారిపోయాడు. 

ఘటనా స్థలంలో ఫోరెన్సిక్, డాగ్​స్క్వాడ్

మంగళవారం ప్రవచనం చెప్పిన తర్వాత భోలే బాబా కారులో వెళ్లిపోయాడు. ఆయన వెహికల్ వెళ్లే మార్గంలోని మట్టిని తీసుకుంటే బాబా ఆశీర్వాదం లభించినట్లేనని విశ్వసించిన భక్తులు.. ఒక్కసారిగా ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. తమవాళ్లు ఆచూకీ ఇప్పటికీ తెలియట్లేదని పలువురు బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. వంద డెడ్​బాడీలను చూసినా తన చెల్లి ఆచూకీ దొరకలేదని ఓ సోదరుడు చెప్పాడు. ఘటనా స్థలంతో పాటు భోలే బాబా ఆశ్రమం, చారిటబుల్ ట్రస్ట్​ను ఉన్నతాధికారులు పరిశీలించారు. తొక్కిసలాట జరిగిన ప్లేస్​కు చేరుకున్న ఫోరెన్సిక్ యూనిట్, డాగ్ స్క్వాడ్ ఆధారాలు సేకరిస్తున్నది.

బాధ్యులను కఠినంగా శిక్షిస్తాం: యోగి

తొక్కిసలాట ఘటనను సీరియస్​గా తీసుకున్న ప్రభుత్వం.. హై లెవల్ కమిటీ ఏర్పాటు చేసి ఎంక్వైరీకి ఆదేశించింది. ఇప్పటికే సత్సంగ్‌‌‌‌ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశామని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. కమిటీకి ఆగ్రా అడిషనల్ డీజీపీ నేతృత్వం వహిస్తారని, ప్యానెల్​లో ఆలీగఢ్ కమిషనర్, హైకోర్టు రిటైర్డ్ జడ్జితో పాటు మాజీ పోలీసు అధికారులు ఉంటారని చెప్పారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకునేలా నిబంధనలు రూపొందిస్తామని తెలిపారు.

సంఘ విద్రోహ శక్తులే కారణం: భోలే బాబా

న్యూఢిల్లీ: హత్రాస్ ప్రమాదంపై భోలే బాబా విచారం వ్యక్తం చేశారు. ‘‘తొక్కిసలాటకు సంఘ విద్రోహశక్తులే కారణం. ప్రమాదం జరిగినప్పుడు నేను అక్కడ లేను. గందరగోళం జరగడానికి ముందే అక్కడి నుంచి వెళ్లిపో యా. మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని దేవున్ని ప్రార్థిస్తున్నా” అని తెలిపారు.

అందమైన అమ్మాయిలకే ఎంట్రీ

భోలే బాబా గదిలోకి కేవలం అందమైన అమ్మాయిలకు మాత్రమే ఎంట్రీ. ఆశ్రమం లో అందరూ అమ్మాయిలే ఉంటారు. వీరితో పాటు అతికొద్ది మందికి మాత్రమే ప్రవేశం ఉంటది. చనిపోయిన అమ్మాయి ని బతికిస్తానంటూ ఆగ్రాలో చేసిన ప్రకటన ల నేపథ్యంలో భోలే బాబాను 23 ఏండ్ల కింద పోలీసులు అరెస్ట్ చేశారు. బాబాకు సంతానం కలగలేదు. క్యాన్సర్​తో బాధపడు తున్న మేనకోడలిని దత్తత తీసుకున్నాడు. ఆశ్రమం కట్టిన ల్యాండ్​ కూడా కబ్జా చేసిందేనని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాగా, భోలే బాబా మెయిన్​పురిలోని తన ఆశ్రమంలో ఉన్న సీక్రెట్ రూమ్​లో దాక్కు న్నట్లు పలువురు అనుమానిస్తున్నారు.