
తెలంగాణ రాష్ట్రంలో ద్రోణి ప్రభావంతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మార్చి 15, 16, 17, 18 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నాయని వెల్లడించారు అధికారులు. ఈ మేరకు రాష్ట్రానికి ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. పగటి పూట ఎండ, సాయంత్రానికి వర్షాలు పడతాయని వివరించారు అధికారులు.
15వ తేదీ ఒకటీ రెండు చోట్ల ఉరుములు మెరుపులతో వర్షాలు పడతాయని సూచన చేశారు. ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడనున్నాయన్నారు. 16న ఉత్తర, పశ్చిమ, మధ్య దక్షిణ జిల్లాల్లో వడగండ్ల వాన కురిసే అవకాశం ఉందని.. 17 18 తేదీల్లో ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని హెచ్చరికలు జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు. ఈ క్రమంలో చేతికి వచ్చిన పంటను కాపాడుకోవాలని.. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా పంటలను కాపాడుకోవచ్చని సలహా ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు.