- రాష్ట్రవాప్తంగా కొద్ది రోజులుగా కంటిన్యూగా కురుస్తున్న వర్షం
- శ్రీశైలానికి భారీగా వరద
హైదరాబాద్, వెలుగు: కొద్దిరోజులుగా రాష్ట్రాన్ని ముసురు వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం ఉమ్మడి మహబూబ్నగర్, ఉమ్మడి ఖమ్మం
జిల్లాల్లో మినహా అన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్లో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంటిన్యూగా వర్షాలు పడుతుండడంతో కృష్ణా బేసిన్లోని నదులకు వరద పోటెత్తుతున్నది.
ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తున్నది. దీంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం 2,54,700 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. ఓ వైపు జూరాలతోపాటు తుంగభద్ర ప్రాజెక్టు నుంచి శ్రీశైలంలోకి ఇన్ఫ్లో వస్తుండడంతో నీటి మట్టం పెరుగుతున్నది.
