ఇంటి నుంచి పనికే ఇష్టపడుతున్నారు

ఇంటి నుంచి పనికే ఇష్టపడుతున్నారు

ముంబై : మన వాళ్లు ఇంటి నుంచే పనిచేయడానికి (రిమోట్‌‌ వర్క్‌‌) ఎక్కువ ఇష్టపడుతున్నారంట. ఈ ఏడాది ఫిబ్రవరి–మే మధ్యలో జాబ్‌‌ సెర్చ్‌‌ల డేటా చూస్తే ఇది అర్ధమవుతోందని ఒక రిపోర్టు చెబుతోంది. ఇంటి నుంచే పనిచేయడానికి ఇష్టపడే వాళ్ల సంఖ్య ఏకంగా ఈ కాలంలో 377 శాతం పెరిగిందని ఆ రిపోర్టు పేర్కొంది. జాబ్‌‌ సెర్చ్‌‌ ప్లాట్‌‌ఫామ్‌‌ ఇన్‌‌డీడ్ ఈ డేటా విడుదల చేసింది. ఇదే టైములో రిమోట్‌‌ వర్క్‌‌ జాబ్‌‌ పోస్టింగ్సూ 168 శాతం పెరిగాయని తెలిపింది. కరోనా వల్ల వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌ బాగా ఊపందుకుందని ఇన్‌‌డీడ్‌‌ ఇండియా ఎండి శశి కుమార్‌‌ చెప్పారు.

ఈ నేపథ్యంలో తమ వర్క్‌‌ఫోర్స్‌‌ను తగిన విధంగా తీర్చిదిద్దుకోవాల్సి ఉంటుందని పరిశ్రమలకు సూచించారు. జాబ్‌‌ గురించి వెతుక్కునేటప్పుడు 83 శాతం మంది తగిన రిమోట్‌‌ వర్క్‌‌ పాలసీ ఉండాలని కోరుకుంటున్నట్లు అంతకు ముందు స్టడీలలో తేలినట్లు ఇన్‌‌డీడ్‌‌ తెలిపింది. వర్క్‌‌ ఫ్రం హోమ్‌‌ కోసం అవసరమైతే తమ జీతంలో కోతకి కూడా ఇష్టపడేవాళ్లు 53 శాతం దాకా ఉన్నట్లు పేర్కొంది.

For More News..

ఇంటి నుంచి పనిచేయడానికే ఇష్టపడుతున్నరు

కూలీల తరలింపునకు 13 కోట్లు ఖర్చుపెట్టిన తెలంగాణ ప్రభుత్వం

విదేశాల్లో దూసుకుపోతున్న ఇండియన్ ఓటీటీలు