T20 World Cup: టీమిండియా జెర్సీలో ఫుట్‌బాల్ లెజెండ్.. ఫైనల్లో భారత్‌కు లియోనెల్ మెస్సీ మద్దతు 

T20 World Cup: టీమిండియా జెర్సీలో ఫుట్‌బాల్ లెజెండ్.. ఫైనల్లో భారత్‌కు లియోనెల్ మెస్సీ మద్దతు 

T20 World Cup: టీ20 వరల్డ్ కప్ 2026 ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఈ గ్రాండ్ ఫైనల్‌లో ఆతిథ్య దేశమైన భారత్ జట్టు, న్యూజిలాండ్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ సాయంత్రం 7 గంటలకి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనుంది. ఈ మ్యాచ్ చూసేందుకు ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  ఈ కీలక పోరుకు ముందు భారత్‌కు ప్రపంచ ప్రఖ్యాత ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ సపోర్టు చేస్తున్నట్లు ప్రకటించాడు. 

టీమిండియా జెర్సీలో మెస్సీ: 
టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు క్రికెట్ అభిమానులను ఆకట్టుకుంటుంది. ప్రముఖ క్రీడా బ్రాండ్ అడిడాస్ ఇండియా తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒక పోస్టును షేర్ చేసింది. ఆ పోస్టులో లియోనెల్ మెస్సీ టీమిండియా జెర్సీ ధరించి కనిపించడం అభిమానులను మరింత ఉత్సాహా పరుస్తుంది. ప్రపంచ ఛాంపియన్స్‌పై మూడు స్ట్రైప్స్ అద్భుతంగా కనిపిస్తున్నాయి. గో టీమ్ ఇండియా అనే పోస్టులో అడిడాస్ రాసుకొచ్చింది. ఈ పోస్టు వైరల్‌గా మారింది. ఫుట్‌బాల్+ క్రికెట్ అనే రెండు క్రీడల మధ్య ఉన్న అనుబంధాన్ని ఇది ప్రతిబింబించింది.

వరల్డ్ కప్ గెలిచిన మెస్సీ: 
మెస్సీకి బిగ్ ట్రోఫీలు గెలవడం కొత్త విషయం కాదు.. అతడి నేతృత్వంలో అర్జెంటీనా జట్టు 2022లో జరిగిన ఫిఫా వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఖతార్‌లో జరిగిన ఆ టోర్నమెంట్‌లో అర్జెంటీనా విజయం సాధించడం ద్వారా మెస్సీ తన కెరీర్‌లో అత్యున్నత ఘనతను అందుకున్నాడు. ఇక వచ్చే 2026 ఫిఫా వరల్డ్ కప్ అమెరికా, మెక్సికో, కెనడా దేశాల్లో జరగనుంది. జూన్ 11వ తేదీ నుంచి జూలై 19 వరకు జరిగే ఈ టోర్నమెంట్‌లో అర్జెంటీనా తమ టైటిల్‌ను కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

భారత్ కూడా డిఫెండింగ్ చాంపియన్:  
టీ20 క్రికెట్‌లో భారత్ కూడా డిఫెండింగ్ చాంపియన్‌గా ఫైనల్‌లో అడుగు పెడుతోంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని జట్టు 2024లో టీ20 వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. ఇప్పుడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో టీమిండియా మరోసారి ట్రోఫీని కాపాడుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో సొంత అభిమానుల మద్దతుతో ఇండియా బరిలోకి దిగనుంది.

భారత్‌తో మెస్సీకి ప్రత్యేక అనుబంధం: 
మెస్సీకి భారత్‌తో అనుబంధం కొత్తది కాదు.. గత సంవత్సరం ఆయన “గోట్ ఇండియా టూర్” పేరుతో భారత్‌ను సందర్శించాడు. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొని అభిమానులతో కూడా కలుసుకున్నాడు.. దేశవ్యాప్తంగా వేలాది మంది ఫ్యాన్స్ మెస్సీని చూసేందుకు భారీగా తరలివచ్చారు. కాగా, మెస్సీ భారత పర్యటనలో న్యూఢిల్లీలో జై షా ఆయనకు టీమిండియా క్రికెట్ జెర్సీతో పాటు ఒక క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మెస్సీ భారత క్రికెటర్లు, అలాగే ఒలింపిక్, పారాలింపిక్ ఛాంపియన్లతో కూడా కలుసుకున్నాడు. ఇది వివిధ క్రీడల మధ్య ఉన్న పరస్పర గౌరవాన్ని ప్రతిబింబించింది.

ఫైనల్‌కు మరింత ఉత్సాహం: 
ఇప్పుడు భారత్–న్యూజిలాండ్ మధ్య జరిగే టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌కు ముందు లియోనల్ మెస్సీ మద్దతు ఇవ్వడంతో మ్యాచ్‌పై మరింత ఉత్సాహాన్ని పెంచింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఈ మ్యాచ్‌ను వీక్షించనున్నారు.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by adidas India (@adidasindia)