నేను రిటైర్ కావడం లేదు : లియోనెల్ మెస్సీ

నేను రిటైర్ కావడం లేదు :  లియోనెల్ మెస్సీ

ఫిఫా ప్రపంచకప్ విజయం తర్వాత లియోనెల్ మెస్సీ కీలక ప్రకటన  చేశాడు. తాను జాతీయ ఫుట్ బాల్ జట్టు నుంచి రిటైర్ కావడం లేదని,  అర్జెంటీనా ఫుట్ బాల్ జట్టుతో ప్రపంచ కప్ ఛాంపియన్‌షిప్ ఆడాలని కోరుకుంటున్నట్లుగా తెలిపాడు. దీంతో  అర్జెంటీనా కెప్టెన్ మరో ప్రపంచ కప్ ఆడకపోవచ్చు... కానీ అతను రాబోయే కోపా అమెరికాలో లా అల్బిసెలెస్టేకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. "ఇది కేవలం నమ్మశక్యం కాదు. దేవుడు నాకు కప్ ఇవ్వబోతున్నాడని నాకు తెలుసు. ఇది మాకు చాలా సంతోషం. ఇది నాకు పెద్ద కల" అని మెస్సీ  అన్నారు. 

లుసైల్ స్టేడియంలో ఆదివారం జరిగిన ఫైనల్‌లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా 4-2తో  విజయం  సాధించింది. ఈ విజయంతో ఆ జట్టు కెప్టెన్ అయిన లియోనెల్ మెస్సీ పేరు మారుమ్రోగుతోంది. అర్జెంటీనా   ప్రపంచ కప్ గెలిచిన తర్వాత లియోనెల్ మెస్సీ సాకర్ ఆల్ టైమ్ అత్యుత్తమ ఆటగాడిగా నిలిచారు. 2006 నుంచి వరల్డ్ కప్ ఆడుతోన్న మెస్సీ.. ఐదోసారి బరిలోకి దిగి.. ఫిఫా ప్రపంచ కప్ గెలవాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు.  ఈ  వరల్డ్ కప్ తరువాత రిటైర్ అవుతానని ప్రకటించిన మెస్సీ ఇప్పుడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు. 

అర్జెంటీనా టీమ్‌‌ను ముందుండి నడిపించిన మెస్సీ  ఫైనల్‌లో డబుల్‌‌ గోల్స్‌‌తో సత్తా చాటాడు. మెస్సీనే ప్లేయర్‌‌ ఆఫ్‌‌ ద టోర్నమెంట్‌‌గా నిలవగా.. టోర్నీలో 8 గోల్స్‌‌ కొట్టిన ఎంబాపె గోల్డెన్‌‌ బూట్‌‌ అవార్డు గెలిచాడు. వరల్డ్‌‌ చాంపియన్‌‌ అర్జెంటీనా గోల్డెన్‌‌ ట్రోఫీతో పాటు రూ. 347 కోట్ల ప్రైజ్‌‌మనీ సొంతం చేసుకుంది.