Football World Cup: ఫుట్బాల్ ప్రపంచంలో లియోనెల్ మెస్సీ (Lionel Messi) గురించి తెలియని వారుండరు.. ఎనిమిది సార్లు బాలన్ డీ ఓర్ (Ballon d'Or) గెలుచుకున్న ఈ లెజెండ్, 2022 ఖతార్ వరల్డ్ కప్‌తో తన కలల ట్రోఫీని ముద్దాడి వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచాడు. కానీ, ప్రతి ఒక్కరి మైండ్‌లో ఉన్న ప్రశ్న ఒక్కటే.. మెస్సీ రిటైర్మెంట్ ఎప్పుడు? అని.. దీనిపై అర్జెంటీనా హెడ్ కోచ్ లియోనెల్ స్కలోని (Lionel Scaloni) ఒక ఇంటర్వ్యూలో క్లారిటీ ఇస్తూ.. మెస్సీకి ఇష్టమున్నంత వరకు అతను ఆడుతూనే ఉంటాడు.. అతను తన కెరీర్‌లో ఆరో వరల్డ్ కప్ ఆడబోతుండటంలో ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాడు.
గాయం నుంచి కోలుకుంటున్న మెస్సీ:
ప్రస్తుతం యునైటెడ్ స్టేట్స్ (USA)లో జరుగుతున్న అర్జెంటీనా ప్రాక్టీస్ సెషన్స్‌లో మెస్సీ కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. మే 24 నుంచి ఎడమ తొడ కండరాల నొప్పితో (Hamstring Issue) బాధపడుతున్న అతడు, జట్టుతో కలవకుండా విడిగా పర్సనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఫాలో అవుతున్నాడు. అయితే ఫ్యాన్స్ అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదని, జూన్ 16న అల్జీరియాతో జరగబోయే అర్జెంటీనా ఫస్ట్ వరల్డ్ కప్ మ్యాచ్ నాటికి మెస్సీ ఫుల్ ఫిట్‌నెస్ సాధిస్తాడని ESPN కన్ఫర్మ్ చేసింది. ప్రస్తుతం కాన్సాస్ సిటీలోని బేస్ క్యాంప్‌లో మెస్సీ రికవరీ అవుతున్నాడు.
మెస్సీపై రూల్స్ పెట్టం: స్కలోని
ఈసారి వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఎక్కువగా ఉండటంతో, మెస్సీపై పడే వర్క్‌లోడ్‌ను (Workload) మేనేజ్‌మెంట్ ఎలా హ్యాండిల్ చేయబోతోందని అడగ్గా, కోచ్ స్కలోని మాట్లాడుతూ.. మెస్సీ విషయంలో నేను ఒక్కడినే కూర్చుని నిర్ణయాలు తీసుకోలేను.. అతనితో ప్రతి విషయాన్ని డిస్కస్ చేస్తాం.. తను ఎలా ఫీలవుతున్నాడో అడిగి తెలుసుకుని, ఇద్దరం ఒక అగ్రిమెంట్‌కు వచ్చాకే డెసిషన్ తీసుకుంటాం.. మెస్సీ మైదానంలో ఉంటే ప్రత్యర్థి జట్లకు వచ్చే ప్రెషరే వేరు.. అతను కొంచెం ఇబ్బందిలో ఉన్నా సరే.. గ్రౌండ్‌లో అతని ప్రెజెన్స్ టీమ్‌కు ఎంతో ఎనర్జీని ఇస్తుందని వెల్లడించాడు.
అర్జెంటీనా వరల్డ్ కప్ షెడ్యూల్:
డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో మెస్సీ తన కెరీర్‌లో ఫస్ట్ టైమ్ వరల్డ్ కప్ ఆడబోతున్నాడు.. అర్జెంటీనా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌ల వివరాలు ఇలా ఉన్నాయి.
* మొదటి మ్యాచ్: జూన్ 16 – వర్సెస్ అల్జీరియా (Kansas City)
* తదుపరి మ్యాచ్‌లు: గ్రూప్ స్టేజ్‌లో మిగిలిన మ్యాచ్‌లను అర్జెంటీనా జట్టు ఆస్ట్రియా, జోర్డాన్ జట్లతో ఆడనుంది.
