డిసెంబర్ 31:బార్లు,వైన్ షాప్స్ ఎప్పటి వరకు అంటే.?

డిసెంబర్ 31:బార్లు,వైన్ షాప్స్ ఎప్పటి వరకు అంటే.?

ఈ నెల 31న  బార్ అండ్ రెస్టారెంట్ లలో  రాత్రి ఒంటి గంట వరకు లిక్కర్ అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. రిటైల్ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు  2B లైసెన్స్ ఉన్న బార్లలో రాత్రి ఒంటిగంట వరకు అమ్మకాలు జరపొచ్చని తెలిపింది.  పబ్స్, బార్లలో మైనర్లను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేసింది.  ఇదిలా ఉంటే న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై పోలీస్ శాఖ నిబంధనలు పెట్టింది. త్రీ స్టార్, ఫైవ్ స్టార్, పబ్బులు, క్లబ్బులకు రూల్స్ రిలీజ్ చేసింది. ఎంట్రీ, ఎగ్జిట్ దగ్గర సీసీ కెమెరాలు తప్పనిసరి ఉండాలని తెలిపింది.

 

 

న్యూ ఇయర్ వేడుకలకు ప్రత్యేక ఈవెంట్స్, డీజే మోతలతో సిటీ మారుమోగనుంది. రెండేండ్ల కరోనా గ్యాప్ తర్వాత... పూర్తి స్థాయిలో న్యూ ఇయర్ వేడుకలు జరగనున్నాయి. దీనికి తోడు ఈ ఏడాది డిసెంబర్ 31 శనివారం రావటంతో... వీకెండ్ కూడా కలిసి వస్తోంది.  దీంతో ఫుల్ గా ఎంజాయ్ చేసేందుకు యువత రెడీ అవుతోంది. వీటికి తగ్గట్టుగానే ప్రత్యేక ఈవెంట్స్ ఏర్పాటు చేస్తున్నారు.

31 రాత్రి నుంచి జనవరి 1న మార్నింగ్ వరకు నెక్లెస్ రోడ్, పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రేస్ వే, ఔటర్ రింగ్ రోడ్డుతో పాటు... పలు ప్లై ఓవర్లు మూసివేయనున్నారు. అటు విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికులు మస్ట్ గా సరైన ధ్రువీకరణ పత్రాలు చూపించేలా చర్యలు చేపట్టారు. మద్యం మత్తులో వాహనాలు నడిపినా... ర్యాష్ డ్రైవింగ్, బైక్ లపై స్టంట్స్ చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.