లిక్కర్ లోడ్ డీసీఎంలో మంటలు.. కరెంట్ వైర్లు తాకడంతో ఘటన.. ఎక్కడంటే..

లిక్కర్ లోడ్ డీసీఎంలో మంటలు..   కరెంట్ వైర్లు తాకడంతో ఘటన.. ఎక్కడంటే..

ఉప్పల్, వెలుగు: లిక్కర్​ లోడ్​తో వెళ్తున్న డీసీఎం వాహనంలో మంటలు చెలరేగాయి. సమయానికి ఫైర్​ సిబ్బంది రావడంతో పెను ప్రమాదం తప్పింది. బుధవారం హబ్సిగూడ నుంచి రామంతపూర్ కు లిక్కర్​ లోడ్​తో డీసీఎం వెళ్తోంది. హబ్సిగూడ స్ట్రీట్ నంబర్ 8 సిగ్నల్ దగ్గర కరెంటు తీగలు తగలడంతో లోడ్​పై ఉన్న కవర్​కు మంటలు అంటుకున్నాయి. ఫైర్ సిబ్బంది హుటాహుటిన అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేయడంతో భారీ నష్టం తప్పింది. లోడ్​లో ఐదు కాటన్ల మద్యం బాటిళ్లు ధ్వంసమైనట్లు డ్రైవర్​ తెలిపాడు.