
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఈ లిక్కర్ దందా వెనుక ఎవరున్నారో తేల్చాలని సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశారు. చీప్ లిక్కర్ కు ఖరీదైన లేబుల్స్ వేసి అమ్ముతున్నారని సంజయ్ ఆరోపించారు. దమ్మంటే కేసీఆర్ దీనిపై విచారణకు ఆదేశించాలని సంజయ్ .. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తప్పు చేస్తే శిక్ష తప్పదని సంజయ్ అన్నారు. లిక్కర్ స్కాంలో కవిత ఉందని సీఎం కేసీఅర్, కేటీఆర్ కు కూడా తెలుసునని, అందుకే వాళ్లు మాట్లాడటం లేదన్నారు. అవినీతిని బీజేపీ సహించదని, మోడీ పాలనలో అవినీతికి స్కోప్ లేదన్నారు సంజయ్. సంజయ్ చేసిన ఆరోపణలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.