AP News: లిక్కర్ వ్యాను బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడిన ప్రజలు

AP News: లిక్కర్ వ్యాను బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడిన ప్రజలు


ఆంధ్రప్రదేశ్​ లో లిక్కర్​ ట్రక్కు బోల్తాపడింది. మద్యం బాటిళ్లు రోడ్డుపై చెల్లా చెదురుగా పడటంతో స్థానికులు సీసాలను ఎత్తుకెళ్లిన ఘటన చిత్తూరు బసిరెడ్డిపల్లిలో చోటుచేసుకుంది.  దీనికి సంబందించి పూర్తి వివరాల్లోకి వెళ్తే  మద్యం లోడుతో వెళుతున్న ట్రక్​ వాహనం అదుపు తప్పి బోల్తాపడింది.  ఇక అంతే అటుగా వెళ్తున్న జనాలు రోడ్డుపై పడిన మద్యం సీసాలపై ఎగబడ్డారు.

కొంతమంది బాక్సులకు బాక్సులే ఎత్తుకెళ్లాగా.. మరికొంతమంది.. లుంగీలు.. టవళ్లు..సంచుల్లో ఎత్తుకెళ్లారు. రోడ్డుపై పడిన మందు బాటిళ్ల కోసం పురుషులే కాదు మహిళలు కూడా పోటీ పడ్డారు.  సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునే సమయానికి దాదాపు సగం లిక్కర్​ బాటిల్స్​ ను జనాలు ఎత్తుకెళ్లారు. మిగిలిన సీసాలను పోలీసులు భద్రపర్చడంలో సగం బాటిల్స్​ మిగిలాయని మద్యం షాపు యజమాని వాపోతున్నారు.  ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.