చిట్టితల్లి చదువుకు సాయం కావాలి

చిట్టితల్లి చదువుకు సాయం కావాలి

ఈ ఫొటోని చిన్నారి పేరు అక్షిత. పక్కన కూర్చొని పేపరు చదివేది ఆమె తాత. వీరు ఉండేది మణికొండ. చిన్నారి తల్లి కొద్దికాలం కిందట చనిపోగా, నాన్న చిన్నారిని వదిలేసి ఎటో వెళ్లి పోగా, తాత అమ్మమ్మల వద్దకు చేరింది. అమ్మమ్మ మెషీన్ ​పని చేస్తది. తాత ఆరోగ్యం బాగుండక ఏ పని చేయలేడు. తాత మనవరాలు ప్రతిరోజు పొద్దుగాల మణికొండలోని గోల్డెన్ టెంపుల్ వద్దకు వచ్చి కూర్చుంటారు. పెద్దాయనకు చదవడం, రాయడం వచ్చు. ఓ న్యూస్​పేపర్ తెచ్చుకుని చదువుతుంటే, పక్కన అక్షిత కూర్చొని చదువుకుంటుంది. ఆమెకు చదువులో సాయంగా ఉంటాడు. ఆయన నోరుతెరిచి ఎవరినీ సాయం అడగడు. ఎవరైనా వచ్చి ఇస్తే కాదనడు. చిన్నారి చదువుకు ఎవరైనా సాయం చేస్తే అది చాలని ఆయన వద్దకు వచ్చిన వారితో చెప్పుకుని బాధపడుతుంటడు. వీరు ఆలయం వద్ద కనిపించగా ఫొటోగ్రాఫర్ ​క్లిక్​ మనిపించారు.

- ఫొటోగ్రాఫర్, వెలుగు