వారం ముందుగా లిటిల్‌‌ హార్ట్స్‌‌

వారం ముందుగా లిటిల్‌‌ హార్ట్స్‌‌

‘90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న  శివానీ నాగరం లీడ్ రోల్స్‌‌లో సాయి మార్తాండ్  తెరకెక్కించిన చిత్రం ‘లిటిల్ హార్ట్స్’.  

ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌‌‌‌పై దర్శకుడు ఆదిత్య హాసన్ నిర్మించాడు. బన్నీ వాస్, వంశీ నందిపాటి రిలీజ్ చేస్తున్నారు.  సెప్టెంబర్ 12న ఈ సినిమా విడుదల కావలసి ఉంది. అయితే వారం రోజులు ముందుగానే సెప్టెంబర్‌‌‌‌ 5న థియేటర్స్‌‌కు తీసుకొస్తున్నట్టు శనివారం ప్రకటించారు.

 ప్రేక్షకులను నవ్వించేందుక ఇంకాస్త ముందుగా వస్తున్నాం అని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు. ఇందులో  రాజీవ్ కనకాల, ఎస్.ఎస్ కాంచి, అనిత చౌదరి, సత్య కృష్ణన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.