సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో లిటిల్ హార్ట్స్ రిలీజ్

సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌లో లిటిల్ హార్ట్స్ రిలీజ్

మౌళి తనూజ్, శివానీ నాగరం లీడ్ రోల్స్‌‌‌‌లో సాయి మార్తాండ్ తెరకెక్కించిన చిత్రం ‘లిటిల్‌‌‌‌ హార్ట్స్‌‌‌‌’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్‌‌‌‌లో వస్తున్న ఈ చిత్రానికి ‘90s మిడిల్ క్లాస్ బయోపిక్’ దర్శకుడు ఆదిత్య హాసన్‌‌‌‌ నిర్మాతగా వ్యవహరించాడు.  

సెప్టెంబర్ 12న ఈ చిత్రాన్ని థియేటర్స్‌‌‌‌లో విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు.  ఈ సందర్భంగా విడుదల చేసిన ప్రోమో ఆకట్టుకుంది.  తండ్రీ కొడుకులుగా రాజీవ్ కనకాల,  మౌళి తనూజ్ కనిపించారు.  ఫ్యామిలీ ఎమోషన్స్‌‌‌‌తో కూడిన ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా వస్తున్న ఈ చిత్రాన్ని బన్నీవాస్, వంశీ నందిపాటి థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.