90స్ మిడిల్ క్లాస్ బయోపిక్’ ఫేమ్ మౌళి తనుజ్, ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న శివానీ నాగరం లీడ్ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘లిటిల్ హార్ట్స్’. ఈటీవీ విన్ ఒరిజినల్ ప్రొడక్షన్ బ్యానర్‌పై దర్శకుడు సాయి మార్తాండ్ రూపొందించారు. ఆదిత్య హాసన్ నిర్మాతగా వ్యవహరించగా, బన్నీ వాస్, వంశీ నందిపాటి సెప్టెంబర్ 12న థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు.
గురువారం ఈ చిత్రం నుంచి ‘రాజా గాడికి’ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో బన్నీ వాస్ మాట్లాడుతూ ‘ప్రేక్షకుల్ని బాగా నవ్వించే మూవీస్ చేయాలని నేను కోరుకుంటాను. అలా ఈ సినిమా చూస్తున్నంత సేపూ నేనూ బాగా ఎంజాయ్ చేశాను. ప్రేక్షకులు కూడా పొట్ట పగిలేలా నవ్వుకుంటారు’ అని చెప్పారు.
కాలేజ్ డేస్‌లోని ఫ్రెండ్స్, అప్పటి విషయాలను గుర్తు చేసేలా ఈ చిత్రం ఉంటుందని వంశీ నందిపాటి అన్నారు. ఎంటర్‌టైన్ చేస్తూనే, ఎక్సయిటింగ్‌గా ఉండే సినిమా ఇదని మౌళి తనుజ్ చెప్పాడు. మంచి జోష్ ఉన్న కాన్సెప్ట్‌లో నటించడం హ్యాపీ అంది శివానీ నాగరం. ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు ప్రేక్షకులు కథతో రిలేట్ అవుతారని దర్శకుడు సాయి మార్తాండ్, నిర్మాత ఆదిత్య హాసన్ అన్నారు. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఈటీవీ విన్ బిజినెస్ హెడ్ సాయికృష్ణ పాల్గొన్నారు.
