అయోధ్య ఈవెంట్​ జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం

అయోధ్య ఈవెంట్​ జైళ్లలో ప్రత్యక్ష ప్రసారం


 Live Telecast in Prison ayodhaya  Ram Mandir  january 22nd programme 
Ayodhya, Rama Mandir, January 22nd Rama prana pratisha, Live telecose, Jails, latest news, telugu news, india news, devotional news, life style news

అయోధ్య రామమందిరం పనులు చకచక జరిగిపోతున్నాయి.అయోధ్య  రామాలయం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జనవరి 22 న జరగనుంది.   అయోధ్యలో మూడంతస్తుల రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణం పూర్తయింది.  చిల్లర మల్లర నిర్మాణ పనులు ఊపందుకున్నాయి.  ఈ కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అంతా సిద్దం చేస్తున్నారు. ఈకార్యక్రమాన్ని లైవ్​ టెలికాస్ట్​ చేయాలని నిర్ణయం తీసుకున్నారు.  జైళ్లలో ఖైదీలు కూడా ఈ మహత్తర కార్యక్రమాన్ని చూసే విధంగా అధికారులు చర్యలు తీసుకున్నారు.  ఇప్పటికే జైళ్ల శాఖ ఉన్నతాధికారులతో ఆలయ నిర్మాణ కమిటి చర్చలు జరిపింది.ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం  ప్రపంచ స్థాయి వేడక అని.. శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఖైదీలు చూడాల్సిన అవసరం ఉందని జైళ్లు మరియు హోంగార్డుల శాఖ సహాయ మంత్రి ధరమ్‌వీర్ ప్రజాపతి తెలిపారు. 

జనవరి 22న అయోధ్యలో శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించడంతో పాటే ఆ రోజున అనేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. 2019 సుప్రీం కోర్టు తీర్పు తరువాత 2020 ఆగస్టు 5 అయోధ్య రామ మందిర నిర్మాణం ప్రారంభమైంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ సహా 6వేల మంది సాధువులు, పూజారులు, ప్రముఖ రాజకీయ నేతలకు, కొంతమంది సెలబ్రెటీస్​ కు ఆహ్వనాలు అందాయి.

బాబ్రీ మసీదు పిటిషనర్ న్యాయవాది​ ఇక్బాల్​ అన్సారీని కూడా శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఆహ్వానం అందించారు. జనవరి 5న   రామ్‌పథ్‌ సమీపంలోని కోటియా పంజితోలలోని ఆయన ఇంటికి ఆహ్వానం అందించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) కార్యకర్తలు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం తరపున ఆయనకు ఆహ్వాన పత్రాన్ని అందజేశారు.


అయోధ్యలో జనవరి 22న శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది.  ప్రపంచ వ్యాప్తంగా గాయనీ, గాయకులు, కళాకారులు శ్రీరాముడిపై భక్తి గీతాలను ఆలపిస్తున్నారు.  స్వస్తి మెహుల్​ పాడిన రామ్​ ఆయేంగే భక్తి కీర్తన తన మనసును భావోద్వేగాలతో... కళ్లను కన్నీళ్లతో నింపిందని ప్రధాని మోదీ తన అభిమానాన్ని వ్యక్తం చేశారు.  ఈ కీర్తన ఒక్కసారి వింటే చాలాసేపు చెవుల్లో ప్రతిధ్వనిస్తుందని తెలిపారు. 

  • Beta
Beta feature