సమోసాలో బల్లి .. మొయినాబాద్ తోలుకట్ట గేటు దగ్గర ఘటన 

సమోసాలో బల్లి .. మొయినాబాద్ తోలుకట్ట గేటు దగ్గర ఘటన 

చేవెళ్ల, వెలుగు: ఓ స్వీటు హౌస్​లో పిల్లలు సమోసా తింటుండగా అందులో బల్లి దర్శనమిచ్చింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని  తోలుకట్ట గేటు దగ్గర ఉన్న మహాలక్ష్మి స్వీట్ షాప్​లో జరిగింది. బుధవారం ఇద్దరు పిల్లలు రెండు సమోసాలు తీసుకున్నారు. మొదటి సమోసా తిన్నాక, రెండోది తినే క్రమంలో అందులో బల్లి కనిపించింది. 

భయబ్రాంతులకు గురైన వారిని స్థానికులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ దృశ్యం చూసిన ఆ షాపులోని ఓ అమ్మాయి వాంతులు చేసుకుంది. షాపు ఓనరు తాళం వేసి పరారైనట్లు స్థానికులు తెలిపారు.