ఎల్ కే అద్వానీకి భారతరత్న

ఎల్ కే అద్వానీకి భారతరత్న

ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. బీజేపీ కురువృద్ధుడు, దేశ మాజీ ఉప ప్రధాని, లాల్ కృష్ణ అద్వానీకి భారతరత్న ప్రదానం చేయనున్నట్లు 2024  ఫిబ్రవరి 03వ తేదీన వెల్లడించారు.  అద్వానీకి భారతరత్న రావడంపై సంతోషం వ్యక్తం చేశారు మోదీ. ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. అద్వానీ  ఈ గౌరవం పొందుతున్నందుకు సంతోషంగా ఉందన్న మోదీ..  దేశ అభివృద్ధిలో అద్వానీ పాత్ర కీలకమని చెప్పారు.  

ఎల్‌కే అద్వానీ  రాజనీతిజ్ఞుడని, చాలా కింది స్థాయి నుంచి ఉప ప్రధాని వరకు ఎదిగారని కొనియాడారు మోదీ.  90వ దశకంలో బీజేపీని ముందుండి నడిపించిన అద్వానీ.. అప్పట్లో అయోధ్య రామాలయం కోసం రథ యాత్ర కూడా చేశారు.  దివంగత ప్రధాని వాజ్పేయీ హయాంలో 2002 నుండి 2004 వరకు భారతదేశానికి 7వ ఉప ప్రధానమంత్రిగా  అద్వానీ సేవలందించారు.  2015లో అద్వానీ పద్మవిభూషణ్ అందుకున్నారు.