LLC 2023: చివరి మెట్టుపై బోల్తాపడిన తెలుగు జట్టు.. ఫైనల్‍లో హైదరాబాద్ ఓటమి

LLC 2023: చివరి మెట్టుపై బోల్తాపడిన తెలుగు జట్టు.. ఫైనల్‍లో హైదరాబాద్ ఓటమి

లెజెండ్స్ లీగ్ క్రికెట్(ఎల్ఎల్‍సీ) 2023 రెండో ఎడిషన్‌లో మణిపాల్ టైగర్స్ జట్టు విజేతగా అవతరించింది. శనివారం సూరత్‌లోని లాల్‌భాయ్ కాంట్రాక్టర్ స్టేడియం వేదికగా జరిగిన ఫైనల్‌ పోరులో అర్బన్ రైజర్స్‌పై.. మణిపాల్ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా రైనా సారథ్యంలోని అర్బన్ రైజర్స్ హైదరాబాద్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది.   

గుర్‍కీరత్ సింగ్ మాన్ మెరుపు ఇన్నింగ్స్ 

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన అర్బన్‍రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు రిక్కీ క్లార్క్ 52 బంతుల్లో 80 పరుగులు చేయగా, భారత బ్యాటర్ గుర్‍కీరత్ సింగ్ మాన్ (36 బంతుల్లో 64 పరుగులు) మెరుపు అర్ధ శతకం బాదాడు. దీంతో హైదరాబాద్ జట్టు మంచి లక్షాన్నే నిర్ధేశించింది. 

రాణించిన రాబిన్ ఊతప్ప

188 పరుగుల లక్ష్యాన్ని మణిపాల్ జట్టు 5 వికెట్లు కోల్పోయి మరో ఆరు బంతులు మిగిలివుండగానే ఛేదించింది. మొదట రాబిన్ ఊతప్ప(40; 27 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్1), చాడ్విక్ వాల్టన్() మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 71 పరుగులు జోడించారు. అనంతరం వీరు వెనుదిరిగినా అసెలా గురణరత్నె (51 నాటౌట్; 29 బంతుల్లో 5 సిక్స్ లు), తిషారా పెరీరా (13 బంతుల్లో 25 పరుగులు) మిగిలిన పనిని పూర్తి చేశారు. హైదరాబాద్ బౌలర్లలో స్టువర్ బిన్నీ 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా.. . అయితే మిగిలిన బౌలర్లు ధారాళంగా పరుగులు ఇచ్చారు. జెరోమ్ టేలర్ ఓ వికెట్ తీసినా 55 పరుగులు సమర్పించుకున్నాడు.