అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు..అధిక వ‌డ్డీతో వేధింపులు

అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు..అధిక వ‌డ్డీతో వేధింపులు

అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు..అధిక వ‌డ్డీతో వేధింపులు
లోన్ యాప్స్ ఆగ‌డాలు- వాట్సాప్ ఆధారంగా అంద‌రికీ మెసేజ్ లు

హైదరాబాద్: ఇన్ స్టా లోన్ యాపుల వేధింపులు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి. ఇంత‌కుముందు లోన్ తీసుకున్న వారి డీటైల్స్ తో లోన్ అడ‌క్కుండానే భారీ వ‌డ్డీతో వారి అకౌంట్ లోకి డబ్బులు జ‌మ చేస్తున్నారు. వెంట‌నే వారం రోజుల్లో అస‌లు వ‌డ్డీ క‌ట్టాలంటూ మెసేజ్ లు పెడుతున్నారు. ఒక్కోసారి అయితే డ‌బ్బులు వేయ‌కుండానే వేసిన‌ట్లు ఆప్ లో చూపిస్తూ హింసిస్తున్నారు. అంతేకాదు .. ఈ పీడ‌ను ఎలాగైనా వ‌దిలించుకుందామ‌ని ఎలాగోలా అప్పు చేసి లోన్ క్లియ‌ర్ చేసినా అప్ డేట్ కాదు. దీంతో ఏం చేయాలో తోచ‌క ఇప్ప‌టికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్న ఘ‌ట‌న‌లు ఉన్నాయి. తాజాగా హైద‌రాబాద్ లో సైబర్ క్రైమ్ స్టేషన్‌లో లోన్ అప్‌పై ఫిర్యాదులు ఎక్కువ‌గా వెలుగులోకి వస్తున్నాయి.

లోన్ అడగకుండానే అకౌంట్‌లోకి డబ్బులు జమ చేస్తున్నారు. తిరిగి వడ్డీ చెల్లించాలని వేధింపులకు గురి చేస్తున్నారు. డ‌బ్బులు క‌ట్టాల్సిన తేదీ మ‌రో మూడు రోజులు ఉన్న‌ప్ప‌టికీ   ఆగ‌కుండా స్నేహితులు, ఫ్యామిలీ మెంబెర్స్‌కి అసభ్య మెసేజ్‌లు పంపుతున్నారు. దీంతో ప‌రువు పోయింద‌ని భావించిన బాధితులు అయోమ‌యంలో ప‌డుతూ ప్రాణాల మీద‌కు తెచ్చుకుంటున్నారు. ఎలాగైనా డేంజ‌ర‌స్ ఫ్రాడ్ యాప్స్ నుండి ప్ర‌జ‌ల‌ను కాపాడాల‌ని బాధితులు , వారి త‌ల్లిదండ్రులు కోరుతున్నారు. ప్లే స్టోర్ నుండి ఈ యాప్స్ ను తొల‌గించాల‌ని వేడుకుంటున్నారు.