పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్...పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం

 పట్టాలు తప్పిన ఎంఎంటీఎస్...పలు రైళ్ల రాకపోకలు ఆలస్యం

ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది.  జూన్ 18వ తేదీ ఆదివారం ఉదయం 8.25 గంటలకు ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముంబైలోని అంబర్ నాథ్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఏమైందంటే..

ముంబైలోని అంబర్‌నాథ్ రైల్వే స్టేషన్ సమీపంలో  లోకల్ రైలు ఎంఎంటీఎస్ పట్టాలు తప్పింది, దీని ఫలితంగా కళ్యాణ్- కర్జాత్ మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  జూన్ 18వ తేదీ ఉదయం 08:25 గంటలకు ఖాళీ రేక్ సర్వీస్‌లో ఉన్న కోచ్ పట్టాలు తప్పింది. దీని కారణంగా  లోకల్ రైలు  మెయిన్ లైన్‌లోకి వెళ్లిపోయింది. దీంతో ఇతర రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.  సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యుద్ధప్రాతిపదికన రైళ్ల రాకపోకలను  పునరుద్ధరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 

ఎంఎంటీఎస్ రైలు పట్టాలు తప్పడంతో  మూడు ఎక్స్ ప్రెస్ రైళ్ల రాకపోకలపై ప్రభావం చూపిందని రైల్వే అధికారులు తెలిపారు.  ఎల్‌టిటి- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైలును అంబర్‌నాథ్ స్టేషన్ హోమ్ సిగ్నల్ వద్ద, వన్ డౌన్ బద్లాపూర్ లోకల్ రైలును ఉల్హాస్‌నగర్ స్టేషన్‌లో నిలిపివేశామన్నారు. అంబర్‌నాథ్ లోకల్ ట్రైన్ ఉల్హాస్‌నగర్ స్టేషన్‌లోని సిగ్నల్ వద్ద ఆగిపోయిందన్నారు.  ఈ మూడు రైళ్లు నిలిపివేయడంతో  ప్రయాణికులు తీవ్ర  అసౌకర్యానికి గురవుతున్నారు.