ఇండ్ల మధ్యలో డంపింగ్ యార్డ్.. స్థానికుల ఆందోళన

V6 Velugu Posted on Jun 12, 2021

హైదరాబాద్: శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని.. ఎన్టీఆర్ నగర్ లో పేదల ఇండ్ల మధ్యలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయడంపై స్థానికులు ఆందోళనకు దిగారు. జీహెచ్ఎంసి అధికారులు రాంకీ సంస్థకు గార్బేజ్ డిస్పోజల్ కాంట్రాక్ట్ ఇచ్చారని.. దీంతో సంస్థ ప్రభుత్వ స్థలంలో డంపింగ్ యార్డు ఏర్పాటు చేసేందుకు కంపెనీ ఏర్పాటు చేస్తుందన్నారు. ఎన్టీఆర్ నగర్ లో 600 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే రోగాలు వస్తాయని కాలనీ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కమిటీ హాల్ కడతానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే, కార్పొరేటర్ ఇప్పుడు డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తుంటే చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Tagged Hyderabad, Locals, houses, dumping yard, worried,

Latest Videos

Subscribe Now

More News