మద్యం మత్తులో మహిళతో అసభ్య ప్రవర్తన

మద్యం మత్తులో మహిళతో అసభ్య ప్రవర్తన

అల్వాల్, వెలుగు: మద్యం మత్తులో మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని స్థానికులు చెట్టుకు కట్టేసి కొట్టారు. ఈ ఘటన అల్వాల్ పీఎస్ పరిధిలో జరిగింది. ఓల్డ్ అల్వాల్​కు చెందిన శేఖర్(28) బుధవారం రాత్రి ఫుల్లుగా తాగి ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు.

దీంతో స్థానికులు అతడిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. అనంతరం డయల్ 100కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని శేఖర్​ను అదుపులోకి తీసుకుని పీఎస్ కు తరలించారు. అల్వాల్ ఇందిరాగాంధీ చౌరస్తా వద్ద మందుబాబులు ప్రతిరోజు హల్ చల్ చేస్తున్నారని.. పోలీస్ చెక్ పోస్టును అక్కడ ఏర్పాటు చేయాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు.