ఢిల్లీలో సడలింపులు.. కేసులు పెరిగితే మళ్లీ ఆంక్షలు

ఢిల్లీలో సడలింపులు.. కేసులు పెరిగితే మళ్లీ ఆంక్షలు

కరోనా కేసులు తగ్గడంతో ఢిల్లీ సర్కార్ మరిన్ని సడలింపులు ఇచ్చింది. సోమవారం ఉదయం ఐదు గంటల నుంచి అన్ని కార్యకలాపాలకు అనుమతిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. మెట్రో, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ బస్సుల్లో 50 శాతం కెపాసిటీతో అనుమతిచ్చారు. ఆటో, రిక్షా,  టాక్సీ వెహికల్‌లో కేవలం ఇద్దరికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. సామాజిక దూరం పాటిస్తూ.. ప్రార్థన మందిరాలు తెరవడానికి అనుమతులిచ్చారు. ఢిల్లీలోకి పర్యాటకులకు అనుమతిలేదని తెలిపారు. పెళ్లిళ్లకు, అంత్యక్రియలకు 21 మందితో హాజరు కావచ్చని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో, ఫంక్షన్ హాల్‌లో పెళ్ళిళ్ళకు, ఫంక్షన్లకు అనుమతిలేదని తెలిపారు. వారాంతపు మార్కెట్లకు అనుమతులిస్తున్నట్లు ప్రకటించారు. స్పాలు, యోగ, జిమ్, పబ్లిక్ గార్డెన్స్, పార్కులకు అనుమతిలేదని తేల్చి చెప్పారు. కాగా.. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న గ్రూప్ వన్ ఉద్యోగులకు వంద శాతం కెపాసిటీతో అనుమతిచ్చారు. మిగతా ఉద్యోగులకు మాత్రం 50 శాతం కెపాసిటీతో పని చేసుకోవడానికి అనుమతిచ్చారు. అదేవిధంగా ప్రైవేటు కార్యాలయాలలో కూడా 50 శాతానికి మించకుండా పనిచేసుకోవచ్చని తెలిపారు. మార్కెట్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లన్నింటికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అనుమతులిచ్చారు. రెస్టారెంట్లు, హోటల్స్ 50 శాతం కెపాసిటీతో తెరచుకోవచ్చని తెలిపారు. ఈ విధంగా వారం రోజులపాటు పర్యవేక్షించిన తర్వాత.. ఒకవేళ కేసులు పెరిగితే మళ్లీ ఆంక్షలు విధిస్తామని సీఎం అరవింద్ కేజ్రీవాల్ హెచ్చరించారు.