లాక్ డౌన్ లో వీటికి ఫుల్‌ పర్మిషన్‌..ఇవి క్లోజ్

లాక్ డౌన్ లో వీటికి ఫుల్‌ పర్మిషన్‌..ఇవి క్లోజ్

హైదరాబాద్‌‌, వెలుగు: రాష్ట్రంలో ఇంకో పది రోజులు లాక్‌‌డౌన్​ను పొడిగిస్తూ కేబినెట్​ నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు పొద్దున ఆరు గంటల నుంచి పది గంటల వరకు ఉన్న సడలింపులను మధ్యాహ్నం ఒంటి గంట వరకు పెంచారు. ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు పాక్షికంగా అనుమతులిచ్చారు. సడలింపుల సమయంలో బయటికి వెళ్లిన వాళ్లు తిరిగి ఇండ్లకు చేరుకునేందుకు అదనంగా ఇంకో గంట వెసులుబాటు కల్పించారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌‌డౌన్‌‌ అమలు చేయాలని నిర్ణయించారు. కరోనా కారణంగా కోల్పోతున్న ఆదాయాన్ని రాబట్టుకునేందుకు ప్రభుత్వ భూములు, హౌసింగ్‌‌ సంస్థ ఆధీనంలో ఉన్న భూములు, ఇండ్ల అమ్మకానికి వెంటనే చర్యలు ప్రారంభించాలని సీఎస్‌‌ సోమేశ్‌‌ కుమార్‌‌ను కేబినెట్​ఆదేశించింది. ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌‌లో సీఎం కేసీఆర్‌‌ అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో లాక్‌‌డౌన్, కరోనా, బ్లాక్‌‌ ఫంగస్‌‌ కేసులు, యాసంగి వడ్ల కొనుగోళ్లు, వానాకాలం పంట సీజన్‌‌కు యాక్షన్‌‌ ప్లాన్‌‌, రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణ తదితర అంశాలపై ఐదున్నర గంటలకు పైగా చర్చించారు.  కేబినెట్‌‌ అనంతరం అధికారులు బయటకు వెళ్లిన తర్వాత రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ఈటల రాజేందర్‌‌ ఇష్యూ,  హుజూరాబాద్‌‌ నియోజకవర్గంలో టీఆర్‌‌ఎస్‌‌ పరిస్థితిపై మంత్రులతో కేసీఆర్‌‌ ప్రత్యేకంగా మాట్లాడారు. అనంతరం ప్రగతి భవన్​ నుంచి ఆయన ఫామ్​హౌస్​కు వెళ్లారు. లాక్​డౌన్​ గైడ్​లైన్స్​పై రాత్రి సీఎస్​ సోమేశ్​కుమార్​ ఉత్తర్వులు జారీ చేశారు. జూన్​ 9 వరకు లాక్​డౌన్​ కొనసాగుతుందని పేర్కొన్నారు. 

వీటికి ఫుల్‌ పర్మిషన్‌
హాస్పిటళ్లు, ల్యాబ్​లు, టీకా కేంద్రాలు, మెడికల్​ షాపులు, మెడికల్‌ ఎక్విప్‌మెంట్‌ తయారీ యూనిట్లు తెరిచే ఉంటాయి. మెడిసిన్‌, ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌ తరలింపునకు అనుమతిచ్చారు. అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. వ్యవసాయం, అనుబంధ రంగాలకు పర్మిషన్​ ఇచ్చారు. ఉపాధి హామీ పనులు కొనసాగుతాయి. బ్యాంకులు, ఇన్సూరెన్స్‌ సేవలు నడుస్తాయి. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, ఎల్పీజీ సిలిండర్ల సరఫరా, ఈ–కామర్స్‌ గూడ్స్‌ డెలివరీ, టెలికాం, పోస్టల్‌, ఇంటర్నెట్‌ సేవలు ఎప్పటిలాగే కొనసాగుతాయి. 

సడలింపులు ఇట్లా..
అన్ని షాపులు, ఆఫీసులు, ఇతర సంస్థలు
మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపెన్‌‌.
ఆర్టీసీ, సెట్విన్‌‌ బస్సులు, ట్యాక్సీలు, 
ఆటోలు ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు  నడుస్తయ్​.
అంగన్‌‌వాడీ కేంద్రాలు మూసేసి, గర్భిణులు, పిల్లలకు పౌష్టికాహారాన్ని ఇండ్లకే చేరవేస్తారు.
గ్రేటర్‌‌ హైదరాబాద్‌‌లో గూడ్స్‌‌ వెహికల్స్‌‌కు 
ఉదయం 9 నుంచి 11 గంటల వరకు పర్మిషన్​.
నేషనల్‌‌ హైవేలు మినహాయించి ఇతర ప్రాంతాల్లోని  పెట్రోల్‌‌ పంపులు మధ్యాహ్నం ఒంటి గంటకే క్లోజ్.​
 పెండ్లిళ్లకు 40 మందికి పర్మిషన్.
 అంత్యక్రియలకు 20 మందికి అనుమతి.
మెట్రో రైళ్లు ఉదయం 7 గంటల నుంచి
ఉదయం 11.55 వరకు నడుపుతరు.

ఇవి క్లోజ్​

సినిమా టాకీసులు, జిమ్ములు, క్లబ్బులు, పబ్బులు, ​ పార్క్‌‌లు, బార్లు, స్విమ్మింగ్​ ఫూల్స్​, స్టేడియాలు, స్పోర్ట్స్​ కాంప్లెక్స్​లు
రాజకీయ,సామాజిక,మత,క్రీడ,విద్య,సాంసృతిక సంబంధిత సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగింపు.
అన్ని ప్రార్థనా మందిరాలు