లాజిస్టిక్స్ సేవల సంస్థ షాడోఫ్యాక్స్ ఐపీఓ ఈ నెల 20–22 తేదీల్లో ఉండనుంది. ప్రైస్బ్యాండ్ను రూ.118–రూ.124గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ రూ.ఏడు వేల కోట్లకు పైగా విలువను ఆశిస్తోంది. ఐపీఓ ద్వారా రూ.1,907 కోట్లు సేకరించనుంది ఇందులో రూ.వెయ్యి కోట్ల ఫ్రెష్ ఇష్యూ, రూ.907.27 కోట్ల ఆఫర్ ఫర్ సేల్ ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్, స్నాప్‌డీల్ ఫౌండర్ కునాల్ బహల్, రోహిత్ కుమార్ బన్సాల్ తమ వాటాలను విక్రయిస్తున్నారు. సేకరించిన నిధులను నెట్‌వర్క్ మౌలిక సదుపాయాలు, కొత్త సెంటర్ల లీజు చెల్లింపులు, బ్రాండింగ్ కోసం ఉపయోగిస్తారు.
