ముగిసిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ

ముగిసిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణ
  • రెండున్నర గంటల పాటు సాగిన విచారణ
  • హాజరుకాని సీఎస్, డీజీపి

జనవరి 2న కరింనగర్లో ఎంపీ బండి సంజయ్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై  సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. బీజేపి ఎంపీ బండి సంజయ్ లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు. స్పందించిన లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ విచారణకు ఆదేశించింది. గత నెల 21న తెలంగాణ సీఎస్,హోం శాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపి ,కరీంనగర్ సీపి, ఏసీపీ, జగిత్యాల డిఎస్పీ, కరీంనగర్ ఇన్స్పెక్టర్కు కమిటీ ముందు హాజరు కావాలని లోక్ సభ ప్రివిలేజ్ కమిటీ ఆదేశాలు హాజరు చేసింది. ఈ రోజు జరిగిన విచారణలో కరీంనగర్ సీపి సత్యనారాయణ, ఇతర పోలీసు అధికారులు కమిటీ ముందు హాజరయ్యారు. రెండున్నర గంటల పాటు విచారణ సాగింది. ప్రధాని మోడీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో  తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపి మహేందర్ రెడ్డి కమిటీ ముందు విచారణకు హాజరుకాలేదు.

 

ఇవి కూడా చదవండి..

దొడ్డి కొమురయ్య బయోపిక్ షూటింగ్ ప్రారంభం

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు