కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

కార్ల హెడ్లైట్ల కిందే ఎగ్జామ్ రాశారు

 

  • నిర్లక్ష్యంగా వ్యవహరించిన సిబ్బంది
  • విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన

బీహార్:  కార్ల హెడ్లైట్ల కిందే విద్యార్థులు తమ ఎగ్జామ్ రాశారు. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని మోతిహారి పట్టణంలో జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం... దాదాపు 400 మంది విద్యార్థులు 12వ తరగతి హిందీ పరీక్ష కోసం మోతిహారిలోని మహారాజా హరేంద్ర కిషోర్ కళాశాలకు చేరుకున్నారు. మధ్యాహ్నం 1.45 గంటలకు ప్రారంభం కావాల్సిన పరీక్ష సీటింగ్ అరెంజ్మెంట్లో జరిగిన తప్పిదం వల్ల ఆలస్యం అయింది. దీంతో సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభమైన పరీక్ష రాత్రి 8 గంటల వరకు కొనసాగింది. కానీ పరీక్ష మొదలైన కొద్ది సమయానికే చీకటి పడటం, పరీక్షా కేంద్రంలో కరెంట్ సదుపాయం లేకపోవడంతో విద్యార్థులు అయోమయానికి గురయ్యారు. వెలుతురు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షా కేంద్రం వద్ద నిరసనకు దిగారు. ఈ క్రమంలో కొంత సమయం పాటు అక్కడ గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని చక్కదిద్దారు. స్పందించిన సిబ్బంది జెనరేటర్ని తెప్పించారు. అయితే పరీక్షా కేంద్రంలోని కారిడార్లో కూర్చున్న విద్యార్థులకు జెనరేటర్ సదుపాయం అందకపోవడంతో పేరెంట్స్ తమ కార్ల హెడ్లైట్లను ఆన్ చేసి పరీక్ష పూర్తయ్యేదాకా అలాగే ఉంచారు. మొత్తానికి నానా తంటాలు పడి విద్యార్థులు తమ పరీక్షను పూర్తి చేశారు. అనంతరం సమాచారం అందుకున్న ఉన్నతాధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

ఇవి కూడా చదవండి..

పద్మశ్రీ రామచంద్రయ్యకు రూ. కోటి రివార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్

అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనకు దిగుతాం