లోకాయుక్త లో అర్వింద్ కుమార్, శివ బాలకృష్ణ పై విచారణ

లోకాయుక్త లో అర్వింద్ కుమార్, శివ బాలకృష్ణ పై విచారణ

పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర విపత్తుల నిర్వహణ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ మాజీ డైరెక్టర్ (ప్లానింగ్) శివ బాలకృష్ణపై లోకాయుక్తలో బుధవారం విచారణ జరిగింది. మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డికి చెందిన ‘వెస్టర్న్ విండ్సర్’ సంస్థకు ప్రభుత్వ భూమిలో హై రైజ్ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారంటూ ప్రముఖ న్యాయవాది ఇమ్మనేని రామారావు లోకాయుక్తను ఆశ్రయించారు. కాందిశీకుల భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసి భారీ మొత్తంలో ముడుపులు తీసుకుని అవినీతికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 

విచారణ సందర్భంగా హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ అధికారుల వైఖరిపై లోకాయుక్త చైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పర్సన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలోనే రెండుసార్లు నివేదిక సమర్పించాలని ఆదేశించినా, ఇప్పటివరకు హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంపై జస్టిస్ రాజశేఖర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. వచ్చే విచారణ సమయానికి ఈ ఆరోపణలపై పూర్తిస్థాయి నివేదికతో పాటు సమగ్ర సమాచారాన్ని సమర్పించాలని ప్రస్తుత హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎండీఏ కమిషనర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లోకాయుక్త ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.