లోక్​సభ ఎన్నికలు : భువనగిరి కోటపైనే నజర్

లోక్​సభ ఎన్నికలు : భువనగిరి కోటపైనే నజర్

భువనగిరి : రాష్ట్ర రాజధానికి ఆనుకుని ఉన్న కీలక లోక్​సభ సెగ్మెంట్ భువనగిరి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా మిర్యాలగూడ లోక్​ సభ స్థానానికి బదులుగా ఈ సెగ్మెంట్ ఏర్పాటైంది. ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, నల్లగొండ జిల్లాల్లో ని ప్రాంతాలను కలుపుతూ ఉండటం, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న యాదాద్రి దేవాలయం వంటి వాటితో ఈ నియోజకవర్గానికి ప్రా ధాన్యత ఎక్కువ.

ఇక్కడ పోటీ ప్రధానంగా టీఆర్​ఎస్​, కాంగ్రెస్​ పార్టీల మధ్యే ఉండనుంది. సెగ్మెంట్ ఏర్పాటయ్యాక తొలిసారిగా 2009లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్​ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ ​రెడ్డి ఎంపీగా గెలిచారు. 2014లో టీఆర్​ఎస్​ నుంచి బూర నర్సయ్య గౌడ్ ఎంపీగా విజయం సాధించారు. ఈ సెగ్మెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గా లు (ఇబ్రహీంపట్నం , మునుగోడు,భువనగిరి, నకిరేకల్, తుంగతుర్తి, ఆలేరు, జనగాం ) ఉన్నాయి . ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఇందులోని ఐదు చోట్ల టీఆర్​ఎస్​ జయకేతనం ఎగురవేసింది. దీంతో ఈసారి పరిస్థితి టీఆర్​ఎస్​కే అనుకూలంగా ఉంటుందన్న అభిప్రాయముంది. అయితే ఇక్కడ కాంగ్రెస్​కు, వామపక్షాలకు కొంత ఓటు బ్యాంకు ఉండటంతో పొత్తు పెట్టుకుని గెలవాలన్న దిశగా ప్రయత్నం చేస్తున్నాయి.

ఏ పార్టీ నుంచి ఎవరు?

భువనగిరి లోక్​సభ సెగ్మెంట్ కోసం అధికా ర టీఆర్​ఎస్​తో పాటు కాంగ్రెస్‍, బీజేపీ, సీపీఐ కూడా గురిపెట్టాయి. సిట్టింగ్‍ స్థా నం కావడం, అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయంతో.. ఈ సీటును భారీ మెజార్టీతో గెలిచి పట్టుని లుపుకొనే దిశగా టీఆర్‍ఎస్‍ కసరత్తు చేస్తోంది. కాంగ్రెస్‍ పార్టీ ఇప్పటి కే ఆశావాహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‍రావు కూడా భువనగిరి సెగ్మెంట్ పై దృష్టి పెట్టారు. ఇప్పటికే స్థానిక నేతలతో సమావేశాలు, సంప్రదింపులు జరుపుతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తరహాలో కాంగ్రెస్‍తో పొ త్తు ఉంటే ఈ లోక్​ సభ స్థానాన్ని తమకు కేటాయించాలని కోరేందుకు సీపీఐ సిద్ధమైంది. పార్టీ నేతలతో సమావేశాలు కూడా నిర్వహిస్తోంది.