నేటి నుంచే నామినేషన్లు

నేటి నుంచే నామినేషన్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో తొలి దశలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది. 25వ తేదీ వరకు ప్రభుత్వ పనిదినాల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 3 గంటల వరకు నామినేషన్లను దాఖలు చేయవచ్చు. 21న హోళీ, 23న నాలుగో శనివారం, 24న ఆదివారం సెలవు కాబట్టి నామినేషన్లు తీసుకోరు. అభ్యర్థులు అన్ని ధ్రువీకరణ పత్రాలను పొందుపరచాలని, లేకుంటే నామినేషన్‌‌‌‌‌‌‌‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉంటుందని సీఈవో రజత్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ చెప్పారు .

నామినేషన్ తో పాటు ఇవీ ఉండాలి ఎన్నికల సంఘం 2003 మార్చి 27న ప్రకటించిన అఫిడవిట్‌‌‌‌‌‌‌‌ ఫారం -26  మూనాలో అఫిడవిట్ ఉండాలి. నేరచరిత్ర వివరాలు, భార్య, కుటుంబ సభ్యుల స్థిరచరాస్తులు, విదేశీ పెట్టు బడుల వివరాలను అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లో పొందుపరచాలి. రా జకీయ పార్టీ అభ్యర్థులు ఫారం–ఏ, ఫారం–బీ, ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గా ల్లో పోటీచేసే అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీ సర్టిఫికెట్‌‌‌‌‌‌‌‌ జతపరచాలి. సెక్యూరిటీ డిపాజిట్‌‌‌‌‌‌‌‌, ప్రమాణ పత్రం కూడా ఇవ్వాల్సి ఉంటుంది.

లోక్‌‌‌‌‌‌‌‌సభ అభ్యర్థిని 10 మంది ఓటర్లు ప్రతిపాదించాలి. వారిలో ఒకరు ఆ నియోజకవర్గం పరిధిలో ఉన్న వ్యక్తి అయి ఉండాలి. సెక్యూరిటీ డిపాజిట్‌‌‌‌‌‌‌‌గా రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 చలాన్‌‌‌‌‌‌‌‌ రూపంలో చెల్లించాలి. ప్రజా ప్రాతినిథ్య చట్టం –1951 సెక్షన్‌‌‌‌‌‌‌‌ 36 పరిధికి లోబడి రిటర్నింగ్‌‌‌‌‌‌‌‌ అధికారి(ఆర్వో ) అధీకృత అధికారిగా ఉంటారు. అఫిడవిట్‌‌‌‌‌‌‌‌లోని అన్ని అంశాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. ఏదేని కాలమ్‌‌‌‌‌‌‌‌ను భర్తీ చేయని పక్షంలో నామినేషన్‌‌‌‌‌‌‌‌ను తిరస్కరిం చే అధికారం ఆర్వోకు ఉంటుంది. 25వ తేదీ సాయంత్రం 3 గంటలలోగా నామినేషన్లు దాఖలు చేయాలి. ఆ తర్వాత నామినేషన్లను స్వీకరించరు. నా మినేషన్‌‌‌‌‌‌‌‌ వేసేందుకు వచ్చే అభ్యర్థి ఆర్వో ఆఫీసుకు వంద మీటర్ల దూరంలోనే తన వాహన శ్రేణిని నిలిపేయాలి. నామినేషన్‌‌‌‌‌‌‌‌ పత్రాలు అందజేయడానికి అభ్యర్థితోపాటు నలుగురికే  అనుమతి ఉంటుంది.