మోడీ పాలనలో.. మాల్యా, నీరవ్ లాంటి వారికే అచ్చేదిన్ : రాహుల్

మోడీ పాలనలో.. మాల్యా, నీరవ్ లాంటి వారికే అచ్చేదిన్ : రాహుల్

కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం బాగుపడింది తప్ప పేదలకు ఒరిగిందేమీ లేదన్నారు AICC అధ్యక్షుడు రాహుల్ గాంధీ. సోమవారం లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన హుజుర్ నగర్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. “దోపిడీ దారులకు మోడీ అండగా ఉంటున్నాడు. విజయ్ మాల్యా లాంటి దేశద్రోహులకు వేల కోట్లు కట్టబెట్టాడు. దేశంలో రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజాలంతా మోడీ పాలనపై విసుగు చెందుతున్నారు. కేసీఆర్ పాలనలో ఆయన కుటుంబం బాగుపడింది తప్పా పేదలకు ఒరిగిందేమీ లేదు. మోడీ, కేసీఆర్ ఇద్దరూ తోడు దొంగలే. పేద ప్రజలకు అండగా ఉండేది ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ అధికారంలో వస్తే పేద కుటుంబాలకు రూ 72 వేలు అకౌంట్ లో వేస్తాం. .దేశ చరిత్రలోనే పేదలపై కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేయబోతోంది.

నోట్ల రద్దుతో పేదల డబ్బును లాకున్న మోడీ బడా బాబుల జేబుల నింపాడు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బడా బాబుల భరతం పడతాం. దేశ ఆర్థిక వ్యవస్థ బలపాడాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలి. నేను మోడీలా అబద్దాలు చెప్పను. మోడీ, కేసీఆర్ పాలనకు చరమగీతం పడాలంటే.. కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించుకోవాల్సిన భాద్యత ప్రజలపై ఉంది. మోడీ  “అచ్చె దిన్” నినాదం సామాన్య ప్రజలకు వర్తించదు. అంబానీ, విజయ్ మాల్యా, నీరవ్ మోడీ లాంటి వారికే మోడీ నినాదం వర్తిస్తుంది” అన్నారు.